Monday, May 31, 2010

పూజ కు ఉపయోగించే కొన్ని పవిత్ర పుష్పాలు వాటి విశిష్టత

పూజ కు ఉపయోగించే కొన్ని పవిత్ర పుష్పాలు వాటి విశిష్టత . The following are some of the sacred flowers described in our ancient literature. They are used for worship in temples and in many houses throughout India.
ఈ పుష్పాలకు సువాసన తో బాటు ఔషధ గుణములు కూడా వున్నవి .బజారు లో దొరికేవి కొన్ని. పూర్వము అడవులలో నుండి సేకరించి / తోటలలో పెంచి పూజకు ఉపయోగించే వారు. చాలా మందికి బంతి ,చేమంతి, జాజి,మల్లె, గులాబీ, సంపెంగ, పద్మము, కనకాంబరం తెలిసినంతగా ఇతర పుష్పాలను కూడా వాడ వచ్చని తెలియదు. అందువల్ల ఈ వ్యాసము ఒక చిన్న ప్రయత్నము raama shree raama 
1. పద్మము, (Lotus): దీన్నే తామర(తెలుగు)కమలము, అరవిందము, నళినము, సరోజము, వారిజము, అని కూడా అంటారు.పుండరీకము, కల్హారము,అంటే తెల్లని పద్మము అని అర్ధము. ఇది విష్ణువు కు, లక్ష్మి కి ప్రీతి పాత్రము.
Botanical name: Nelumbo nucifera Gaertn., Family: Nelumbonaceae
Lotus పద్మము 
2. కదంబము/ కడిమి : Botanical name: Mitragyna parvifolia (Roxb.) Korth., Neolamarckia cadamba (Roxb.) Bosser,ఈ రెండు వృక్షాలు కదంబముగా పిలవ బడుతున్నాయి . వ్యాసుడు, మహాకవి కాళిదాసు, శంకర భగవత్పాదులు  పార్వతినికదంబ వన వాసిని , కదంబ ప్రియ  గా వర్ణించారు.    ఈ చెట్లు  అడవిలో  సహజం గా పెరుగుతాయి . పుష్పాలు  సువాసన భరితం గా ఉంటాయి.
Mitragyna / కదంబ 

కదంబ /Neolamarkia 
   3.జపా పుష్పం: మందారం Botanical name: Hibiscus rosa-sinensis ; Family: Malvaceae
 ఈ పుష్పాలను కాళికా మాతకు , శివుడికి  ప్రీతి పాత్ర మైనవి గా వర్ణించారు. అంగారకుని జపా పుష్ప వర్ణము కల వాని గా వర్నిస్తారు. జిల్లేడు,మరికొన్ని పుష్పములను కూడా మందారము అని వర్ణించడం జరిగింది.Bauhinia purpurea L.,Bauhinia variegata L., Bauhinia tomentosa L., వీటిని కూడా మందారము / దేవకాంచనము/ మోదుగ  అంటారు. 
"మందార గంధ సంయుక్తం, చారు హాసం ..... అని కృష్ణుని,మందార గంధ యుతం అని అమ్మ వారిని వర్ణించారు. 
పార్వతిని "మహతీ మేరునిలయా మందార కుసుమ ప్రియా "అని వర్ణించారు 
Bauhinia purpurea మందారము

జపా పుష్పం 
4. నీలోత్పలము : నల్ల/నీలి కలువ: Indian blue water lily, Indian water lily (Eng.);
కృష్ణుని కొందరు కవులు  నీలోత్పల ద్యుతి(నీలి కాలువ వంటి వర్ణము /కాంతి)  గల వాని గా వర్ణించారు . దుర్గా దేవి పూజ కు, నారాయణుని పూజకు విశేషంగా వాడతారు .  
Botanical name: Nymphaea nouchali Burm.f., syn. Nymphaea stellata Willd.

నీలి కలువ 
5. కుందము: అడవి జాజి: Botanical name: Jasminum auriculatum Family: Oleaceae  కాళిదాసు  పార్వతి పలు వరుస కుందముల వలె ఉన్నవని వర్ణింప బడినది.సరస్వతి మల్లె వలె తెల్లని వర్ణము కలిగినదని వర్ణించ బడినది.   ఇవి దేవి పూజకు వాడబడుతున్నాయి.  వాసంతి, మాగధి, మొల్లలు అనికూడా పిలుస్తారు. ఇవి సుగంధ భరితము. 
Jasminum sambac (L.) Aiton, మల్లె, నవమల్లిక ఇవి మనము విరివిగా వాడే , బజారులో దొరికే మల్లె పూలు. Jasminum angustifolium (L.) Willd., అడవిమల్లె,సిరిమల్లె,  శ్రీమల్లె ఇవి కూడా అడవులలో దొరుకుతాయి. సుగంధ భరితము, ఈ మల్లె జాతులన్నీ దేవుని పూజకు ఉపయోగించ వచ్చు     
కుందము 
6. బంధూక పుష్పము :   మంకెన  పువ్వు : సూర్యాష్టకం లో-బంధూక పుష్ప సంకాశం - హార కుండల శోభితం ; మహా పాప హరం......   తం సూర్యం ప్రణ మామ్య హం   సూర్యుని వర్ణము బంధూక పుష్ప వర్ణము గా వర్ణించారు.
  Botanical name:. Pentapetes phoenicea L.,Family: Malvaceae
Ixora coccinea L., Family: Rubiaceae దీనిని రామబాణం, నూరువరహాల పూలు అంటారు, దీనికే మంకెన, బంధూకము అనే పేర్లు కూడా వున్నాయి. కావున వీటిని కూడా ఉపయోగించ వచ్చు. ఎర్రని రంగు కలిగిన పుష్పాలను కొందరు మంకెన పూలు గా వ్యవహరిస్తారు. 
లలితా దేవిని "బంధూక కుసుమ ప్రఖ్యా "అని, "జపా పుష్ప నిభా కృతి"అని   వర్ణించారు  
Ixora coccinea మంకెన పూలు 
  
మంకెన/ బంధూక  పువ్వు 
7. అతశీ : Botanical name: Linum usitatissimum, Family: Linaceae,  also known as Flax plant.  Seed are rich in omega-3 fatty acids; fiber is used weave coarse cloth. కృష్ణాష్టకం లో అతశీ  పుష్ప సంకాశం  హార నూపుర శోభితం --- కృష్ణం వందే జగద్గురుం- వాసుదేవుడి అతశీ పుష్ప వర్ణం లో వున్నా డని  వర్ణించారు. ఇవి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో సహజం గా కనిపించవు. చల్లని ప్రదేశాల్లో పెరుగు తాయి .   
అతశి పుష్పం 
8.వకుళ లేదా పొగడ: Botanical name: Mimusops elengi L., Family: Sapotaceae
 ఈ పుష్పాలు విష్ణువు కు ప్రీతి కరము. సుగంధ భరితము.  కృష్ణుడు బృందావనం లో ఈ పూల సుగంధమును ఇష్ట పడే వాడని వర్ణించ బడినది. విష్ణు పూజకు వాడతారు.తిరుమల లో వెంకటేశ్వర స్వామికి కూడా ఈ పొగడ పూల మాలలు వేస్తారు .
వకుళ /పొగడ 
9. మాలతీ:  Botanical name: Aganosma cymosa Family: Apocynaceae;బృందావనం లో కృష్ణుని అలరించిన తీగ  పుష్పాలు. సుగంధ భరితం. ఇవి మల్లెల్లాగే తెల్లగా సుగంధ భరితం గా ఉంటాయి. అడవుల్లో పెరుగుతాయి.    
మాలతి 
 10. మాధవి : Botanical name: Hiptage benghalensis(L.) Kurz, వీటి కాయలకు 3 రెక్కలుంటాయి, అందువల్ల వీటిని పావురాయి  కాయలని కూడా అంటారు .  బృందావనం లో కృష్ణుని అలరించిన తీగ  పుష్పాలు. అడవుల్లో సహజం గా ఉంటాయి .సుగంధ భరితం.   
  
మాధవీ లత 
11. చంపకము: Botanical name: Magnolia champaca (L.) Baill. ex Pierre,
 ఈ పుష్పాలు విష్ణువుకు పార్వతి కి ప్రీతి పాత్రము. సుగంధ భరితము. వీటిని చాంపేయము, సంపంగి పూలని కూడా పిలుస్తారు. వీటిని పూజకు విరివిగా ఉపయోగిస్తారు.     
చంపకం 
12. సేవంతిక: Chrysanthemum indicum , చేమంతి పూలు
13. పారిజాతము : Nyctanthes arbor-tristis L.,  పొగడ, సేపాలిక, అని కూడా పిలుస్తారు.   
పారిజాతం 
13. అర్క(జిల్లేడు) : Botanical name: Calotropis giganteaశివునికి అర్కముడు అనే పేరు కూడా వున్నది, సూర్యునికి కూడా అర్కుడు అని పేరు.  తెల్లని పూలు గలవి శ్రేష్టము ఈ పూలను గణపతి, శివ, సూర్య పూజకు మాత్రమే వాడతారు . రధ సప్తమి నాడు సూర్యారాధనకు వాడుతారు.   విష్ణు ఆరాధనకు ఉపయోగించరు.దీని కర్రతో గణపతి విగ్రహాన్ని చేసి పూజ చేస్తారు
ఆర్క/జిల్లేడు  
 15. పలాశ: కింశుక / మోదుగ: Botanical name: Butea monosperma  దీని పుష్పాల తో హోళీ రంగులు చేసి ఆడుకుంటారు . దీని శాఖ తో చేసిన కర్రను ఉపనయనము సమయం లో వాడతారు .వీటిని మన్మధుని గోర్లు అని కూడా అంటారు.
పలాశ 
  16. ద్రోణ: తుమ్మిపూలు; Botanical name: Leucas aspera ; వీటి పూలను కార్తీక మాసం లో మాస శివ రాత్రి , సోమవారం, ఆర్ద్ర నక్షత్రం వున్న రోజుల్లోశివ పూజకు ఉపయోగిస్తారు. వీటి ఆకును ఆకు కూర గా వాడతారు. విష్ణు పూజకు ఉపయోగించరు.
ద్రోణ / తుమ్మి 
17. అశోకము :  ఈ చెట్టు కింద నే సీతమ్మ వారు రావణుడి చెర లో  వుండినదని రామాయణం లో వర్ణించ బడినది. దీనికి వంజులము అని మరియొక పేరు.  ఇది శోక నాశకము గ భావిస్తారు. వీటి పూలను అమ్మ వారి పూజకు వాడతారు. లలితా దేవిని "చంపకాశోకపున్నాగ సౌగంధికా లసత్కచా "అని వర్ణించారు (she decorated her hair with Champak, Ashoka, Punnaga and Sougandhika flowers)
 Botanical name: Saraca indica, Family: Fabaceae
అశోక వృక్షం 
18. మామిడి/చూతముBotanical name: Mangifera indica Family: Anacardiaceae
హిందువుల ఇళ్ళలో మామిడి ఆకులు లేకుండా ఏ పండుగను కానీ శుభ కార్యమును గానీ ఊహించలేము. ఇది అతి పవిత్రమైన వృక్షము. దీని ఆకులనే కాక పుష్పాలను కూడా సరస్వతీ దేవి, వినాయకునికి , లక్ష్మీ పూజకు వాడతారు.
Mangifera indica మామిడి 
18.  వేప:Botanical name: Azadirachta indica Family: Meliaceaeదీనిని నింబ వృక్షము అని కూడా అంటారు.  వేప పూలను తెలుగు వారు ఉగాది నాడు వాడతారు . వేప చెట్టు ను లక్ష్మీ స్వరూపం గా పూజిస్తారు.  గ్రామ దేవతల పూజలకు ఉపయోగించడము అందరికి తెలిసినదే .
19. కేతకి :దీన్నే మొగలి పూవు అని కూడా అంటారు.
Botanical name: Pandanus odorifer Family: Pandanaceae 
దీన్ని శివ పూజకు తప్ప మిగిలిన దేవతారాధనకు వాడతారు. శివ లింగము ఆది అంతము చూచానని అబధ్దము చెప్పడం వలన పూజకు పనికి రాకుండా పోయింది.
కేతకి , మొగలి పువ్వు 
20. పున్నాగ : దీన్ని పొన్న అనికూడా అంటారు.
Botanical name: Calophyllum inophyllum L., Family:Calophyllaceaeతెల్లని సుగంధ భరితపుష్పాలు ఉంటాయి. వీటిని శివ పార్వతుల పూజకు, విష్ణు పూజకువాడతారు.
పున్నాగ/పొన్న  
21. పాటల/ పాటలీ/కలిగొట్టు పుష్పము:Botanical name:Stereospermum tetragonum DC.,Family: Bignoniaceae 
శివ పార్వతుల సమాగమము ఈ చెట్టు కింద జరిగినదనిపురాణములలో వర్ణించ బడినది.అందువలన పసుపు రంగు కల ఈ పుష్పము లుశివపార్వతుల కు ప్రీతి పాత్రము.
లలితా పరమేశ్వరి  "దురా రాధ్యా , దురా ధర్షా పాటలీ కుసుమ ప్రియా "అని కీర్తించ బడింది  
పాటల /కలిగొట్టు 
22. కరవీరము/ఎర్రగన్నేరు/కస్తూరిపూలు:Botanical name: Neerium indicum L.,
వీటిని శివ, పార్వతి, వినాయక పూజకు వాడతారు.  
  
 23. దేవకాంచనము/అడవి గన్నేరు/ దేవ గన్నేరు అనికూడా అంటారు.Botanical name: Plumeria alba (తెల్ల పూలవి), Plumeria rubra(ఎర్ర పూలవి). 
దేవ కాంచనం 
24. మధూకము: దీనినే ఇప్ప/ విప్ప అంటారు. వీటిని పూజకు వాడక పోయినా, ఎండిన పూలను తేనెతో కలిపి  భద్రాచలం వంటి కొన్ని దేవాలయాల్లో ప్రసాదం గా వాడతారు.ఇవి తియ్యగా ఉంటాయి. 
    Botanical name:  Madhuca longifolia(J.Koenig ex L.)J.F.Macbr, 
Madhuca flowersఇప్పపూలు 
కనకాంబరం, జాజి, గులాబీ , నందివర్ధనం, గన్నేరు,
లింగాక్షతలు/ చిలకముక్కుపూలు,
గిరికర్ణికా-అంటే శంకు పుష్పాలు: Botanical name: Clitoria ternatea L., 
శంకు పుష్పము 
 దేవకాంచనము,  వంటి సుగంధ భరిత పుష్పాలను వాడతారు.
  నాగ కేసరము: Mesua ferrea L.,
నాగ కేసరము Mesua ferrea

 శివలింగం పూలు: 
Couropitta guinensis శివ లింగం పూలు 


బంతి  Mari gold, Botanical name: Tagetus patula దీన్ని గొబ్బెమ్మలు , బతుకమ్మల ను అలంకరించడానికి వాడతారు ; పురాతన గ్రంధాలలో దీని ప్రస్తావన లేదు. 
తంగేడు, గురుగు, గుమ్మడి , బీర ,  పూలను ప్రధానం గా బతుకమ్మ(తెలంగాణాలో  ) పూజించడానికి , గొబ్బెమ్మలను(ఆంధ్ర లో ) పూజించడానికి వాడతారు.
తంగేడు /బతుకమ్మ పూలు 
సీతమ్మ జడలు 
గురుగు పూలు 
గుమ్మడి పూవు 
వీటిని కూడా గుమ్మడి పూవు అంటారు. ఇది పొద 
బీర పూలు 
పూలనే కాకుండా పత్రాలను, మొక్కల నుండి లభించే జిగురు మొదలయినవి కూడా పూజకు ఉపయోగిస్తారు.
మామిడి ఆకు లేనిదే శుభ కార్యము జరుగదు . కలశ నిర్మాణము లో వాడతారు.  
1.బిల్వ (మారేడు )వాటిలో  శివునికి బిల్వ (మారేడు ) దళాలను వాడతారు.శైలూషము,శాండిల్యము, శ్రీఫలము అనికూడా పేర్లు. దీని Botanical name: Aegle marmelos (L.)Corrêa.కొన్ని ప్రదేశములలో మూడు దళములు గల వరుణ వృక్షాన్ని మారేడు కు మారుగా శివారాధనకు వాడతారు. దీని శాస్త్రియ నామము Crateva religiosa ,దీన్ని వుసిక మాను, ఉలిమిరి అని కూడా అంటారు  
 2. తులసి: Botanical name: Ocimum tenuiflorum Syn. Ocimum sanctum. భారత దేశములో తులసి మొక్క గురించి తెలియని వారుండరు.బృంద,కృష్ణతులసి/నల్లతులసి,లక్ష్మి తులసి/తెల్లతులసి,అని కూడా అంటారు. కుక్క తులసి తప్ప మిగిలినవి పూజకు వాడ వచ్చు. ఇవి విష్ణు పూజకు , ప్రశస్తము. తులసి దళాలు వేసిన నీరు కఫ హరము. 
3.  మరువకము,Origanum majorana L., దవనమును Artemisia pallens Wall. ex. DC.,  కూడా పూజ కు వాడుతారు. ఇవి సుగంధ భరితము.    
4.నాగవల్లి/ తమల పాకు: Botanical name: Piper betel పార్వతి, కాళిక లను "నాగవల్లీరసవాసినీ" అని వర్ణించారు. తమలపాకులను హనుమంతుని పూజకు వాడడం అందరికీ తెలిసినదే.
5. గరిక : Botanical name: Cynodon dactylon; దీన్ని విఘ్నేశ్వరునిపూజకు వాడతారు. 
6. దర్భ గడ్డి : Botanical name: Desmostachya bipinnata, దీన్ని కుశ అని కూడా అంటారు జపము , యజ్ఞము మొదలైన క్రతువులలో దీన్ని వాడతారు.      
7. చందనము  /శ్రీగంధము: Botanical name: Santalum album, కలపను అరగదీసి చేసే ముద్దను గంధము అంటారు. ఇది భగవంతుని కి లేపనం గా వాడతారు.     
8. ధూపము: Botanical name:  Boswellia serrata Roxb. ex Colebr., గుగ్గిలం, పరంగి సాంబ్రాణి, అందుగ: ఈ చెట్టు నుండి వచ్చే జిగురు పదార్ధము నుగుగ్గిలం అంటారు
Agaru :అగరు Aquillaria agallocha ఈ చెట్టు నుండి లభించే జిగురు ను అగరు  అంటారు.
సాంబ్రాణి  Styrax benzoin అనే చెట్టు నుండి లభించే జిగురు. ఈ  రెండు చెట్లు మన దేశంలో సాధారణంగా వుండవు. వీటితో శివారాధన సమయం లో ధూపం వేస్తారు.     
9. కర్పూరముBotanical name:  Cinnamomum camphora ఈ చెట్టుఆకులు, కలప నుండి కర్పూరము ను సంగ్రహిస్తారు. దీన్ని అభిషేకజలములో, తాంబూలము లో నివేదనకు ఉపయోగిస్తారు. 
11. రుద్రాక్ష : Botanical name:Elaeocarpus ganitrus,  ఈ చెట్టు విత్తనాలనురుద్రాక్షలు అంటారు. రుద్రుని(శివుని )కన్నీటి చుక్క నుండి మొలిచిన చెట్టు గా ప్రసిద్ధి . వీటిని మాలలు గా చేసి జపానికి , శివుని పూజకు ఉపయోగిస్తారు.     
10. చెఱుకు : దీనిని రసాలము అని కూడా అంటారు.Botanical name: Saccharum officinarum,.మన్మధుని విల్లు చెరకుగడ , పార్వతి చేతిలోనూ చెరకుగడ ఉంటుంది.
అరటి పిలకలు, మామిడాకుల తోరణాలు, అరటి ఆకులు   శుభ కార్యాల్లో తప్పని సరిగా ఉండాల్సిందే.  
Sacred trees: పవిత్రమైన వృక్షాలు 
1. మర్రి /వట వృక్షము : Ficus benghalensis; It is considered as sacred. Lord Shiva in the form of Dakshina murthy said to be seated under the tree for meditation. Vaishnavites believe that lord Krishna lies on the leaf. 
2. రావి /అశ్వథ వృక్షము :  Ficus religiosa : Hindus consider this tree as incarnation of Lord Vishnu (As per Bhagavdgita); It is worshiped  as God. A peepal tree and a neem tree are planted together and consider them as lord Vishnu and goddess Laksmi. Some consider this tree as manifestation of Brahma (base), lord Vishnu (middle part, top as lord Shiva.   

 చివరగా ఒక మాట: శంకర భగవత్పాదుల శివానంద లహరి లో ని ఈ శ్లోకం చదవండి   
గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే 
విశాలే శైలే  చ  భ్రమతి కుసుమార్ధం జడ మతి 
సమార్పైకం చేతస్సరసిజం ఉమానాథ భవేత్ 
సుఖేనా వ స్థాతుం  జన ఇహ న జానాతి కి మ హో 
అర్ధము: ఓ ఉమా నాథుడా (శివుడా ) మంద బుద్ధి గల వారే నీ పూజా పుష్పాల కొరకు లోతైన చెరువుల్లో, జన సంచారం లేని ప్రమాద కరమైన అడవుల్లో, విశాల మైన కొండల్లో తిరుగుతాడు. కానీ హృదయ సరోవరం లో పూచిన ఒక పద్మాన్ని నీకు సమర్పిస్తే వున్న చోటే సుఖం గా ఉండ వచ్చ్చని ఈ ప్రజలకు తెలియ దంటే విచిత్రం గా వుంది . ఈ పూల న్నిటి కన్నా హృదయ పద్మమే భగవంతునికి ప్రీతి కరము అని భావము .
పద్మశ్రీ పొందిన ధర్పల్లి (చెట్ల)రామయ్య  కు కోటి నమస్కారములు; ఎవరో పెంచిన చెట్ల నుండి కోటి పూలు తెఛ్చి దేవుడిని పూజించుట కన్నా మనం కనీసం ఒక చెట్టయినా నాటి తే  కోటి పూల తో పూజ చేసిన ఫలం వస్తుంది. ఇది సత్యము.

12 comments:

  1. Hello Lalithamba garu. I am a Lawyer from Vijayawada. I am a Science graduate with Botany. so interested in knowing and growing plants. The information given by you is so good. so useful who knows not much about plants & who run and worry about simple problems.....

    ReplyDelete
  2. అమ్మా,

    బిళ్ళగన్నేరు అన్నా phlox అన్నా ఓకటేనా?

    ReplyDelete
  3. Dear Sir,
    I Umesh Chandra Dash, SRF, RPRC, BHUBANESWAR, ODISHA want some information regarding plant Bacopa floribunda. If you have any information about the availability please inform me. My mail id - umeshchandradash90@gmail.com and contact -9583297687.

    Eagerly waiting your response sir.


    Thanks,
    UMESH CHANDRA DASH
    SRF, RPRC
    BHUBANESWAR
    ODISHA

    ReplyDelete
  4. Your content is awesome. why dont you put a particular blog on shami plant

    ReplyDelete
  5. Nice madam, I'm an Ayurveda doctor. Felt happy that atleast someone from mainstream botany linked plant science to our ancient references of holy books.
    You can find abundant literature in our ancient Ayurveda texts. You can refer bhaava prakaash nighantu

    ReplyDelete
  6. చాలా మంచి సమాచారం ఇచ్చ్చారు. నమస్కారం....

    ReplyDelete
  7. Beautiful post, thanks for sharing lots of information related plants and their benefits.
    Plant pots India
    Planters India
    Buy planters
    Plant pots online
    <a href="https://www.yuccabeitalia.com/blog/wall-hanging-pots-online-india
    >Pots online India</a>

    ReplyDelete
  8. Madam, I am Dhananjayan from kerala. My wife is doing research on Croton species. We are searching for C.klotzschianus and C. Scabiosus. While searching about C.klotzschianus images, we are directed to photos, which was taken by you.
    Kindly give us directions for the collecting it from velugonda hills.
    dhcheruvakkad@gmail.com

    ReplyDelete
  9. Fantastic post! The Sidhpur Matrugaya is an incredible site with such rich history. Your insights really highlight its cultural importance. Thanks for shedding light on this unique heritage spot!

    ReplyDelete